శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 19:35:32

గాడిద‌ను ఇంట‌ర్వూ చేసిన జ‌ర్న‌లిస్ట్‌..క‌రోనా ముచ్చ‌ట్లేనా?

గాడిద‌ను ఇంట‌ర్వూ చేసిన జ‌ర్న‌లిస్ట్‌..క‌రోనా ముచ్చ‌ట్లేనా?

క‌రోనా రాకుండా ఉండాలంటే మాస్క్ ధ‌రించాలి. శానిటైజ్ యూస్ చేయాలి. సామాజిక దూరం పాటించాల‌ని ఎన్ని ర‌కాలుగా చెప్పినా ఎవ‌రి మెద‌డ‌కూ ఎక్క‌ట్లేదు. అందుకే ఓ గాడిదను అడ్డం పెట్టుకొని మాస్క్ పెట్టుకోని వాళ్లంద‌రినీ గాడిద‌లు అని ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేశాడు ఓ జ‌ర్న‌లిస్ట్‌. గాడిద‌ను ఇంట‌ర్వూ చేసిన వీడియో నెట్టిట్లో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. 'నువ్వు మాస్క్ ఎందుకు ధ‌రించ‌లేదు. క‌నీసం శానిటైజ‌ర్ కూడా వాడ‌డం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు. క‌రోనా ప‌ట్ల నీకు అవ‌గాహ‌న లేదా?' అని ఇంట‌ర్వూలో గాడిద‌ను ప్ర‌శ్నించాడు. అది ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డంతో..

రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్య‌క్తిని అడిగాడు. నేను అడిగిన ప్ర‌శ్న‌లు వేటికి గాడిద స‌మాధానం ఇవ్వ‌లేద‌ని, ఆ ప్ర‌శ్న‌లేంటో వివ‌రించాడు. అందుకు ఆ వ్య‌క్తి గాడిద మాట్లాడ‌దు క‌దా. క‌రోనా రాకుండా ఉండాలంటే మాస్క్ ధ‌రిచాలి అని గాడిద‌కు తెలియ‌దు క‌దా అని ఆ వ్య‌క్తి బ‌దులిచ్చాడు. అంటే మాస్క్ ధ‌రించ‌ని వారిని గాడిద‌తో పోల్వ‌చ్చా అన్నాడు జ‌ర్న‌లిస్ట్. హా.. అంతే క‌దా అని జ‌వాబిచ్చాడు. ఇక్క‌డ కామెడీ ఏంటంటే.. స‌మాధానం ఇచ్చిన వ్య‌క్తి కూడా గాడిద‌లా మాస్క్ పెట్టుకోలేదు. త‌న‌ని తానే గాడిద అనుకున్న విష‌యం కూడా క‌నిపెట్ట‌లేక‌పోయాడు. ఈ ఇంట‌ర్వూ ద్వారా రిపోర్ట‌ర్ ఎంత చ‌క్క‌గా వివ‌రించాడో.. స‌లాం కొట్టాల్సిందే.. అందుకే నెటిజ‌న్లు కూడా ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి. logo