ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 07:12:51

వెంటిలేట‌ర్ పై చికిత్స‌పొందుతూ జ‌ర్న‌లిస్టు మృతి

వెంటిలేట‌ర్ పై చికిత్స‌పొందుతూ జ‌ర్న‌లిస్టు మృతి

ఆగ్రా: ఆగ్రాలో  క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన జ‌ర్న‌లిస్ట్ చికిత్ప‌పొందుతూ మృతి చెందారు. ఇటీవ‌లే క‌రోనా ల‌క్ష‌ణాలుండ‌టంతో స‌ద‌రు జ‌ర్న‌లిస్టును ఎస్ మెడిక‌ల్ కాలేజ్ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చేర్చారు. బుధ‌వారం నుంచి వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతూ మృతి చెందార‌ని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్ర‌భు ఎన్ సింగ్ వెల్ల‌డించారు.

హాట్‌స్పాట్ గా ఉన్న ఆగ్రాలో ఇప్ప‌టివ‌ర‌కు 241 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo