బుధవారం 25 నవంబర్ 2020
National - Sep 24, 2020 , 20:35:45

విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్

 విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్

ఢిల్లీ : జోల్స్ హెల్త్ ఎంటర్ ప్రయిజ్స్ విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్ ను విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి ఫంక్షనల్ షుగర్ ఫ్రీ, జీరో కార్బ్ హెల్త్ డ్రింక్ ను అందిస్తున్నది. షోషకాలు, విటమిన్లు, మైక్రో న్యూట్రెంట్స్  తో కూడిన ఎనర్జీ డ్రింక్ ఇది. ప్రస్తుత జీవనశైలి లో వస్తున్న ఆరోగ్యసమస్యలపై పోరాడేలా అధ్బుతమైన పోషకాలని ఈ డ్రింక్ ద్వారా అందిస్తున్నారు. దేశంలోని అన్ని మల్టీ బ్రాండ్ రిటైల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. విభిన్నమైన అనుభూతులు పంచే ఆరోగ్యకరమైన ఇన్నోవేటివ్ ఉత్పత్తులు అందించాలన్నది తమ మౌలిక సిద్దాంతమని జోల్స్ హెల్త్ ఎంటర్ ప్రయిజ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సిద్దార్ధ మిశ్రా తెలిపారు.

 నో కార్బన్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్లోకి తీసుకరావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫస్ట్ ఫన్ ఎనర్జీ హెల్త్ డ్రింక్ ఇదేనన్నారు మిశ్రా. ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్న మా ఉత్పత్తులకు అందరి నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, ఫిజీ బేవరేజెస్ లో ఉండే సమస్యలను, లోపాలను గుర్తించి.. వాటికి దూరంగా దేశీయ వినియోదారుల కోసం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నో కార్బన్ డ్రింక్ ను మార్కెట్లో విడుదల చేస్తున్నామన్నారు సిద్దార్థ మిశ్రా. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.