ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 21:48:26

కేంద్రమంత్రి అథవాలే ట్వీట్‌పై సోషల్‌మీడియాలో జోకులు!

కేంద్రమంత్రి అథవాలే ట్వీట్‌పై సోషల్‌మీడియాలో జోకులు!

న్యూ ఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్లలో చైనా ఫుడ్‌ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలేపై నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుస్తున్నారు.  భారతదేశంలో చైనీస్ ఆహారాన్ని విక్రయించే అన్ని రెస్టారెంట్లతోపాటు హోటళ్లను మూసివేయాలని ఆయన ట్వీట్‌  చేయగా, ఇదేం తలతిక్క వ్యవహారమంటూ మండిపడుతున్నారు.  టిక్‌టాక్‌లాంటి యాప్‌లను బ్యాన్‌ చేయాలని అంతా అంటుంటే మంత్రిగారు గోబీ మంచురియాను బంద్‌ చేయమంటున్నారంటూ ఒకరు ట్వీట్‌ చేశారు. కరోనా దెబ్బతో ఇప్పటికే చాలామంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పిలుపుతో వాళ్ల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు.

  చైనా ఫోన్లను బ్యాన్‌ చేయలేదు.. చైనా యాప్‌లను బ్యాన్‌ చేయలేదు.. కానీ చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ను బంద్‌ చేస్తామని మంత్రి పేర్కొనడం ఎంతవరకు సమంజసమని పలువురు ట్వీట్‌ చేశారు. మంత్రిగారూ గోబీ మంచూరియా చేయడం నేను నేర్చుకున్నాను.. కావాలంటే దాని పేరు మార్చండి అంటూ మరొకరు చురకంటించారు. కాగా, ఇదివరకు కూడా రాంనాథ్‌ అథవాలే ‘గో కరోనా గో’ అని వ్యాఖ్యానించగా, ఆ నినాదం వైరల్‌ అయ్యింది. 


logo