శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 26, 2020 , 21:40:50

రోడ్డు మధ్యలో పగిలిన పైప్‌లైన్‌.. తృటిలో తప్పించుకున్న కారు!

రోడ్డు మధ్యలో పగిలిన పైప్‌లైన్‌.. తృటిలో తప్పించుకున్న కారు!

జోద్‌పూర్‌: అది ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారి. పెద్దసంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. అయితే, నడిరోడ్డుపై 20 ఏళ్లకిందటి భూగర్భ పైప్‌లైన్‌ పగిలి, నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో వచ్చిన ఓ కారు, బైక్‌ చాకచక్యంగా అక్కడినుంచి తప్పించుకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో జోద్‌పూర్‌లో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దగ్గరివరకూ వచ్చిన కారు, దాని వెనుకే వచ్చిన బైక్‌ రైట్‌ టర్న్‌ తీసుకోవడం అందరినీ అబ్బురపరిచింది. వారు మాత్రం బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయారు.  ఈ దృశ్యాన్ని కింద వీడియో లింక్‌లో మీరూ చూసేయండి..లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo