శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 02:22:18

వ్యతిరేకులపై దేశద్రోహి ముద్ర

వ్యతిరేకులపై దేశద్రోహి ముద్ర
  • జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌ ఆరోపణ

కోల్‌కతా: ఆరెస్సెస్‌-బీజేపీ తమ వ్యతిరేకులపై దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నాయని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌) అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌ ఆరోపించారు.  గురువారం కలకత్తా యూనివర్సిటీ బయట జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా భగత్‌సింగ్‌ను దేశద్రోహి అని ముద్ర వేసిందని గుర్తు చేశారు. బీజేపీ-ఆరెస్సెస్‌ విచ్ఛిన్నకర రాజకీయాలపై పోరు కోసం ప్రజాతంత్ర శక్తులు తమ విభేదాలను విడనాడాలని కోరారు. ‘మనం పరస్పరం మన మార్గాల్లో పరిధి దాటకుండానే’ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాడాలని పిలుపునిచ్చారు. సౌరబ్‌ గంగూలీ- మహ్మద్‌ అజారుద్దీన్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌-కాజీ నజ్రుల్‌ ఇస్లాం మధ్య వారి మతం గుర్తింపు ద్వారా విభేదాల సృష్టికి ప్రయత్నిస్తున్న వారిని ఏకాకులను చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
logo