శనివారం 06 జూన్ 2020
National - May 09, 2020 , 16:13:03

జూన్ 25వ తేదీ లోగా జేఎన్‌యూ త‌ర‌గ‌తులు ప్రారంభం...

జూన్ 25వ తేదీ లోగా జేఎన్‌యూ త‌ర‌గ‌తులు ప్రారంభం...

న్యూఢిల్లీ: ఆంక్ష‌లు స‌డ‌లింపుతో జ‌వ‌హార్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యంలో త‌ర‌గ‌తులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామ‌ని జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌ల‌ర్ జ‌గ‌దీష్ కుమార్ ప్ర‌క‌టించారు. జూన్ 25వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మ‌ధ్య త‌ర‌గ‌తులు ఎప్పుడైనా ప్రారంభ కావొచ్చ‌ని పేర్కొన్నారు. కోవిడ్‌-19 ప‌రిస్థితి, యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విద్యా క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించాం.

 త‌ర‌గ‌తులు పునఃప్రారంభం కాగానే విద్యార్థుల‌కు మిగిలిపోయిన సెల‌బ‌స్ పూర్తి చేసి జులై 31వ తేదీ లోపు ప‌రీక్ష‌లు పూర్తి చేస్తామ‌న్నారు. త‌రుప‌రి సెమిస్టార్‌కు త‌ర‌గ‌తులు ఆగ‌స్టు 1వ త‌ర‌గ‌తి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. ప్ర‌స్తుత ఈ అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ తాత్కాలికమైంది. లాక్‌డౌన్ ఎత్తివేయ‌గానే ప‌రిస్థితుల‌కు అనుగూణంగా, యూజీసీ నుంచి వ‌చ్చే కొత్త మార్గ‌ద‌ర్శ‌కాను బ‌ట్టి మారుతాయ‌న్నారు 


logo