సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 17:14:22

సిలబస్ పై జేఎన్టీయూ కీలక నిర్ణయం...?

సిలబస్ పై జేఎన్టీయూ కీలక నిర్ణయం...?

హైదరాబాద్ : 2020-21 జూన్‌లో విద్యా సంవత్సరం మొదలు కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు దేశమంతా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో స్కూల్స్, పాఠశాలలు, విద్యాసంస్థలు పున: ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా 2020-21 సంవత్సరానికి సిలబస్ తగ్గిస్తారని పలు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా జేఎన్టీయూహెచ్ స్పందించింది. ఇంజినీరింగ్ 2020-21 సంవత్సరానికి గాను సిలబస్ తగ్గించకూడదని నిర్ణయించినట్లు జేఎన్టీయూ పేర్కొంది. సిలబస్ కుదించకుండా పూర్తిస్థాయిలో బోధిస్తూనే విద్యా సంవత్సరం పూర్తి చేయాలని భావిస్తున్నది. దీని కోసం సమ్మర్, ఇతర సెలవులను తగ్గించాలని యోచిస్తున్నది. కాగా, డిసెంబర్ 1వ తేదీ నుంచి బీటెక్ తరగతులను ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.