గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 16:58:01

అక్కితంకు జ్ఞాన‌పీఠ్‌ అవార్డు అంద‌జేత‌

అక్కితంకు జ్ఞాన‌పీఠ్‌ అవార్డు అంద‌జేత‌

హైద‌రాబాద్‌: మ‌ల‌యాళ క‌వి అక్కితం అచ్చుత‌మ్ నంబూద్రికి ఇవాళ జ్ఞాన‌పీఠ్‌ అవార్డును అంద‌జేశారు. కేర‌ళ‌లోని కుమ‌ర‌న్న‌ల్లూరులో అవార్డు అంద‌జేత‌  కార్య‌క్ర‌మం జ‌రిగింది.  దేశంలో అత్యున్న‌త సాహితీ అవార్డును ఓ కేర‌ళ క‌వి గెలుచుకోవ‌డం ఇది ఆర‌వ‌సారి. అవార్డు అంద‌జేత  కార్య‌క్ర‌మాన్ని సీఎం విజ‌య‌న్ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు.  న్యాయ‌, సాంస్కృతిక‌ మంత్రి ఏకే బాల‌న్ ఈ అవార్డును అంద‌జేశారు. కోవిడ్ వ‌ల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌తో అవార్డు అంద‌జేత కార్య‌క్ర‌మాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేశారు. బ్ర‌తికి ఉన్న  మ‌ల‌యాళీ క‌వుల్లో అక్కితం సాహిత్యం అద్భుత‌మైంద‌ని సీఎం విజ‌య‌న్ అన్నారు. మ‌ల‌యాళీ ప్ర‌జ‌లు అక్కితంను మ‌హాక‌విగా భావిస్తుంటారు.  ఆధునిక సాహిత్యానికి వ‌న్నె తెచ్చిన‌ట్లు చెబుతుంటారు.  ఆకాశ‌వాణిలో స్క్రిప్ట్ రైట‌ర్‌గా మూడు ద‌శాబ్ధాల పాటు ప‌నిచేశారాయ‌న‌. 
logo