శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 28, 2021 , 19:16:28

జైష్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. ఆయుధాలు స్వాధీనం

జైష్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. ఆయుధాలు స్వాధీనం

శ్రీనగర్‌: పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్‌ పోలీసులు పట్టుకున్నారు. బందిపొరా పోలీసులు, భద్రతా దళాలు ఏర్పాటు చేసిన చెక్‌పాయింట్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఆ ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక పిస్టల్, ఐదు గ్రెనేడ్లు, బులెట్లు ఉన్నట్లు బందిపొరా పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో జైష్‌ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల గురించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo