ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 13:52:13

జ‌మ్ముక‌శ్మ‌ర్‌లో రోప్ వే ప్రారంభం

జ‌మ్ముక‌శ్మ‌ర్‌లో రోప్ వే ప్రారంభం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ప‌ర్యాట‌క రంగం కొత్త పుంత‌లు తొక్క‌నున్న‌ది. మూడు ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల‌ను క‌లుపుతూ ఒక రోప్ వేను నిర్మించారు. బాహు కోట ఆలయం నుండి మహామాయ ఆల‌యం వరకు నిర్మించిన‌ రోప్ ‌వే సేవ‌ల‌ను జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జీసీ ముర్ము సోమ‌వారం ప్రారంభించారు. పీర్ఖోలోని జ‌మ్వంత్ గుహ‌లు, మ‌హామాయ ఆల‌యం, బాహు కోట ఆల‌యాన్ని క‌లుపుతూ ఈ రోప్ వేను నిర్మించిన‌ట్లు చెప్పారు. మూడు ప్ర‌ముఖ దేవాల‌యాను క‌లిపే ఈ రోప్ వే, జ‌మ్మూలోని తీర్థ‌యాత్ర ప‌ర్యాట‌క రంగాన్ని పెంచేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

logo