బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 17:01:07

కాలర్‌ట్యూన్స్‌లో కరోనా జాగ్రత్తలు చెబుతున్న జియో, ఎయిర్‌టెల్‌..!

కాలర్‌ట్యూన్స్‌లో కరోనా జాగ్రత్తలు చెబుతున్న జియో, ఎయిర్‌టెల్‌..!

టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌లు తమ వినియోగదారులకు కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్తలు చెబుతున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆయా నెట్‌వర్క్‌లకు చెందిన వినియోగదారులకు కాల్స్‌ చేసినప్పుడు కాలర్‌ట్యూన్స్‌లో ఆ జాగ్రత్తలు వినిపిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు కాల్స్‌ చేస్తే కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ పలు సూచనలు వినిపిస్తున్నాయి. 

కరోనా వైరస్‌ వ్యాపించకుండా ముఖాన్ని మాస్క్‌ లేదా హ్యాండ్‌ కర్చీఫ్‌తో కవర్‌ చేయాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి వాటిని అడ్డుగా పెట్టుకోవాలని, సబ్బుతో చేతులను ఎప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలని, చేతులతో ముఖం, కళ్లు, ముక్కు టచ్‌ చేయవద్దని, ఎవరైనా దగ్గినా, వారికి జ్వరంగా ఉన్నా ఎదురుగా ఉన్న వారు కనీసం 1 మీటర్‌ దూరంలో ఉండాలని చెబుతూ జియో, ఎయిర్‌టెల్‌లు కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. 


logo
>>>>>>