గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 15:24:52

ఝార్కండ్‌లో విజృంభిస్తున్న కరోనా

ఝార్కండ్‌లో విజృంభిస్తున్న కరోనా

రాంచీ : ఝార్కండ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 5,399 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,656 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 2,695 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురై 48 మంది మృతి  చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 38,902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 543 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10,77,618 కరోనా కేసులు నమోదు కాగా 6,77,423 మంది చికకిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. 3,73,379 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 26,816 మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ ఆదివారం తెలిపింది.  logo