గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 08:48:42

జంగిల్‌లో మైనర్‌పై తొమ్మిదిమంది అత్యాచారం

జంగిల్‌లో మైనర్‌పై తొమ్మిదిమంది అత్యాచారం

డుమ్కా : జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ స్నేహితుడి మాటలు నమ్మి మోసపోయిన యువతి అత్యాచారానికి గురైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుల్లో ఇద్దరు వచ్చి బాలికను బైక్‌పై ఓ స్నేహితుడి గ్రామ సమీపంలోని నీటి కొలను వద్దకు తీసుకువెళ్లారు. కాసేపు అనంతరం తనను ఇంటి దగ్గర దిగబెట్టాల్సిందిగా మరో స్నేహితుడికి ఫోన్‌ చేసి అడిగింది. అతడు మరో యువకుడితో కలిసి బైక్‌పై యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. 

బైక్‌పై యువతిని ఎక్కించుకుని అటవీ మార్గం గుండా దగ్గరి దారి ఉందని చెప్పి బైక్‌ను దారి మళ్లించారు. అడవి లోపల మరో ఏడుగురు యువకులు ఉన్నారు. మిగిలిన ఎనిమిదిమంది తన స్నేహితుడితో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారంది. యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిన అనంతరం యువకులంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆమె మెలకువలోకి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితులంతా పరారీలో ఉన్నట్లు వారిని అరెస్ట్‌ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వై ఎస్‌ రమేష్‌ తెలిపారు.


logo
>>>>>>