మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 13:52:54

మంత్రితోపాటు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

మంత్రితోపాటు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

రాంచి: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌‌ మంత్రిమండలి సహచరునికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన కార్యాలయంలో అధికారులు భయాందోళనలకు గురవుతున్నారు. జేఎంఎం పార్టీకి చెందిన ఆ మంత్రికి మంగళవారం సాయంత్రం కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను రాత్రి పొద్దుపోయిన తర్వాత రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)కు తరలించారు. అంతకుముందు అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో 53 ఏండ్ల ఆ ఎమ్మెల్యేకు ధన్‌బాద్‌లోని బీసీసీఎల్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. 

కాగా, ఈ ఇద్దరు కరోనా బాధితులు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులు భయపడుతున్నారు. అదేవిధంగా ఆ ఎమ్మెల్యే సోమవారం సాయంత్రం సింద్రీలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాని 150 మంది పాల్గొన్నారు. జార్ఖండ్‌లో ఇప్పటివరకు 3000 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 149 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo