శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 16:22:22

మేక దొంగతనం.. ఒకరు హత్య.. మరొకరి పరిస్థితి విషమం

మేక దొంగతనం.. ఒకరు హత్య.. మరొకరి పరిస్థితి విషమం

రాంచీ : మేక దొంగతనం చేశారని.. ఓ ఇద్దరు వ్యక్తులను చితకబాదగా, అందులో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జార్ఖండ్‌ దుమ్కా జిల్లాలోని కత్తికుంద్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కత్తికుంద్‌ గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న మరో గ్రామానికి చెందిన సుభాన్‌ అన్సారీ(26), దులాల్‌ మిర్ధా(22) కలిసి మేక దొంగతనం చేశారు. వీరిద్దరూ మేకను ఊరి బయట కట్‌ చేస్తున్నట్లు సదరు మేక యజమానికి సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న మేక యజమాని ఆ ఇద్దరిని తమ గ్రామంలోకి తీసుకొచ్చాడు. ఊరంతా కలిసి అన్సారీ, మిర్ధాను చెట్టుకు కట్టేసి తీవ్రంగా చితకబాదారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo