గురువారం 09 జూలై 2020
National - Jun 27, 2020 , 17:37:34

జార్ఖండ్ లో జులై 31 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగింపు

జార్ఖండ్ లో జులై 31 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగింపు

రాంచీ : జార్ఖండ్ లో జులై 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ రాష్ర్ట సీఎం హేమంత్ సోరేన్ వెల్ల‌డించారు. లాక్ డౌన్ పొడిగింపు కాలంలో రాష్ర్ట‌, అంత‌ర్ రాష్ర్ట బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌వ‌వు అని తెలిపారు. హోట‌ల్స్, లాడ్జిలు, రెస్టారెంట్లు మూసివేసి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. జులై చివ‌రి వ‌ర‌కు సెలూన్స్, స్పాలు, బార్బ‌ర్ దుకాణాలు మూసి ఉంటాయ‌ని చెప్పారు. 

జార్ఖండ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,294 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,647 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


logo