మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 16:33:06

జార్ఖండ్‌ విద్యాశాఖ మంత్రికి కరోనా

జార్ఖండ్‌ విద్యాశాఖ మంత్రికి కరోనా

రాంచీ : జార్ఖండ్‌ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్‌ మహ్తో కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో ఆయన రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (రిమ్స్‌)లో చేరారు. జలుబు, దగ్గు, శ్వాస సమస్యలు తలెత్తడంతో ఆయన సోమవారం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన సొంత నియోజకవర్గం బొకారోలో ఉండగా.. ఫలితాలు రావడంతో ఆయనను ప్రత్యేక 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్‌కు తరలించారు. ‘మిత్రులారా గత  కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. దీంతో చికిత్స కోసం రిమ్స్‌కు వెళుతున్నాను. అధికారిక కార్యక్రమాలన్ని రద్దు చేబడుతాయి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో 79వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా.. 600కుపైగా వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo