బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 23:18:50

లోగో డిజైన్‌ చేయండి.. లక్ష పట్టండి!

లోగో డిజైన్‌ చేయండి.. లక్ష పట్టండి!

రాంచి :  ఔత్సాహిక ఆర్టిస్టులకు జార్ఖండ్‌ సర్కారు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  ‘అకాడమిక్ కౌన్సిల్’ లోగో డిజైన్‌ చేయాలని కోరుతూ ప్రకటన చేసింది. ఎవరైనా డిజైన్‌ చేసి పంపవచ్చని, బెస్ట్‌ లోగోగా ఎంపికైతే రూ.లక్ష పారితోషకం అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం సీఎం హేమంత్‌ సోరెన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరగ్గా, పలు నిర్ణయాలు తీసుకుంది. లోగో డిజైన్‌ విజేతలకు నగదు పారితోషకం ప్రతిపాదనతో పాటు, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా మాస్క్‌ ధరించాలనే ఆదేశాల జారీకి సంబంధించి తీర్మానం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఫేస్‌ మాస్క్‌ ధరించకుండా తిరిగితే జరిమానా విధించాలన్న తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo