గురువారం 09 జూలై 2020
National - Jun 18, 2020 , 16:43:29

పొగాకు ఉత్పత్తుల వినియోగంపై జార్ఖండ్‌ నిషేధం

పొగాకు ఉత్పత్తుల వినియోగంపై జార్ఖండ్‌ నిషేధం

రాంచీ: కరోనా నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

వలస కార్మికులు తిరిగి వచ్చినప్పటి నుంచి జార్ఖండ్‌లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. మరోవైపు పాన్‌పరాగ్‌, గుట్కా వంటివి తీసుకున్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను వినియోగించడాన్ని జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుందని పేర్కొంది.logo