మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 16, 2020 , 14:38:13

జార్ఖండ్‌లో నీటి వనరుల వద్ద ఛట్‌పూజ నిషేధం

జార్ఖండ్‌లో నీటి వనరుల వద్ద ఛట్‌పూజ నిషేధం

రాంచీ : కొవిడ్ -19 మహమ్మారి కారణంగా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం బహిరంగ నీటి వనరుల్లో ఛట్‌పూజను నిషేధించింది. మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, జలశయాలు సహా నీటి వనరుల్లో ఛట్‌పూజను అనుమతించబోమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సంప్రదాయ పండుగతో భారీగా జనం గుమిగూడే అవకాశం ఉంటుందని, సామాజిక దూరం, జనాభాను నియంత్రించడం సాధ్యం కాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే నీటి వనరుల వద్ద స్టాల్స్‌, బారికేడ్లు, ఘాట్ల వద్ద ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లపై ఆంక్షలు విధించింది. అలాగే పండుగ సందర్భంగా పటాకులు పేల్చడం, సంగీత, ఇతర వినోద, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిషేధించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.