బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 12:44:46

జార్ఖండ్‌లో ఘోరం.. మైకా గని పైకప్పు కూలి ఆరుగురు సజీవ సమాధి!

జార్ఖండ్‌లో ఘోరం.. మైకా గని పైకప్పు కూలి ఆరుగురు సజీవ సమాధి!

రాంచీ : జార్ఖండ్‌లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మైకా గని పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు సజీవ సమాధి అయినట్లు సమాచారం. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో చేసుకుంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశామని, మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడెర్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎహ్తేషామ్ వక్వారిబ్ తెలిపారు. గురువారం సాయంత్రం కొడెర్మాలోని ఫుల్వారియా ప్రాంతంలో సుమారు ఎనిమిది మంది మైకా స్క్రాప్ సేకరిస్తున్నారని, ఈ క్రమంలో గని పైకప్పు కూలిపోయిందని పేర్కొన్నారు. పలువురు కేకలు వేయడంతో అక్కడే ఉన్న పలువురు ఇద్దరిని రక్షించగా.. మిగతా వారిని ఆచూకీ దొరకలేదని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

VIDEOS

logo