శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 09:21:55

జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ చైర్మన్‌ నివాసంలో ఈడీ సోదాలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ చైర్మన్‌ నివాసంలో ఈడీ సోదాలు

ముంబయి : జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి బుధవారం రాత్రి ఈడీ అధికారులు గోయల్‌ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. రూ.46 కోట్లు మోసానికి పాల్పడ్డారని ఓ ట్రావెల్‌ కంపెనీ ఫిర్యాదుపై నరేశ్‌ గోయల్‌ ఆయన భార్య అనితా గోయల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీని ఆధారంగా గోయల్స్‌పై అదేవిధంగా జెట్‌ ఎయిర్‌వేస్‌పై సెంట్రల్‌ ఏజెన్సీ ఈసీఐఆర్‌(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదుచేసింది. అదేవిధంగా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన చట్టాల కింద ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ కింద నరేశ్‌ గోయల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ వాగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. 


logo