శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 15:54:33

జైషే-ఇ-మహ్మద్‌ ఉగ్రవాది అరెస్ట్‌

జైషే-ఇ-మహ్మద్‌ ఉగ్రవాది అరెస్ట్‌

శ్రీనగర్‌ : జైషే-ఇ-మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాల సిబ్బంది నేడు అరెస్ట్‌ చేసింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం సోపూర్‌ జిల్లా బల్గాం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాది నుండి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ ఉదయం అనంతనాగ్‌ జిల్లాలో భద్రతా దళాల సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదలు హతమైన విషయం తెలిసిందే. హతమైన ఉగ్రవాదులు లష్కరే-ఇ-తోయిబాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకు పారిపోయారు. పారారైన దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.logo