బుధవారం 08 జూలై 2020
National - Jun 18, 2020 , 17:23:31

కొండ‌పై నుంచి ప‌డ్డ జీపు.. ముగ్గురు మృతి, ఇద్ద‌రికి గాయాలు

కొండ‌పై నుంచి ప‌డ్డ జీపు.. ముగ్గురు మృతి, ఇద్ద‌రికి గాయాలు

సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం సాయంత్రం ఐదుగురు వ్య‌క్తుల‌తో వెళ్తున్న జీపు అదుపుత‌ప్పి కొండ‌పై నుంచి ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గ‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదంలో జీపు నుజ్జునుజ్జు కావ‌డంతో మృతులు, క్ష‌త‌గాత్రులు అందులోనే చిక్కుకుపోయారు. కిన్నౌర్ జిల్లాలోని న్యుగ‌ల్‌సారి ఏరియాలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్ర‌మాదానికి సంబంధించిన స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని గాయ‌ప‌డినవారిని సిమ్లా జిల్లాలోని రాంపూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను వెలికితీసి పోస్ట్ మార్టానికి పంపించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని కిన్నౌర్ జిల్లా పోలీసులు తెలిపారు.      


logo