గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 07:47:24

జేఈఈ, నీట్‌ను వాయిదా వేయండి!

జేఈఈ, నీట్‌ను వాయిదా వేయండి!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ 2020, నీట్‌ 2020 ప్రవేశ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు #PostponeJEE_NEETSept పేరిట సోషల్‌ మీడియా ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో జరుగనున్న ఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్‌-2020ని, సెప్టెంబర్‌ 13న నీట్‌-2020ని నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


logo