బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 15:50:53

అసోం జేఈఈ టాపర్, అతడి తండ్రి అరెస్టు

అసోం జేఈఈ టాపర్, అతడి తండ్రి అరెస్టు

దిస్‌పూర్‌ : మరో అభ్యర్థితో పరీక్షలు రాసి టాపర్‌గా నిలిచిన వ్యక్తితో పాటు ఆయన తండ్రిని కూడా అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి అజారా పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గత నెలలో జరిగిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) మెయిన్స్‌లో అసోంకు చెందిన నీల్‌ నక్షత్ర దాస్‌ 99.8 శాతం మార్కులు సాధించాడు. నకిలీ అభ్యర్థిని కూర్చోబెట్టి పరీక్ష రాయించడంతో ర్యాంకు పొందాడని ఆరోపణలు రావడంతో పోలీసులు నీల్‌ నక్షత్రదాస్‌తోపాటు అతని తండ్రి డాక్టర్‌ జ్యోతిర్మేదాస్‌ను అరెస్ట్‌ చేశారు. పరీక్షా కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు హేమేంద్రనాథ్ శర్మ, ప్రంజల్ కలిత, హిరులాల్ పాథక్ పాత్ర ఉన్నదని దర్యాప్తులో తేలడంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ గురువారం కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈ కేసులో పాల్గొన్న మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. నకిలీ అభ్యర్థితో పరీక్ష రాయించడం వెనుక పెద్ద కుంభకోణం దాగివున్నదని పోలీసులు అంటున్నారు.

పరీక్ష రోజున నిందితుడు పరీక్ష కేంద్రానికి వెళ్లి జవాబు పత్రంలో పేరు, రోల్ నంబర్ రాసి బయటకు వెళ్లిపోయాడు. అప్పుడు అసలు అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్ష రాసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు పరీక్షా కేంద్రాన్ని సీలు చేసి మేనేజ్‌మెంట్‌కు సమన్లు ​​పంపారు. ఈ సంఘటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కు కూడా సమాచారం అందించారు. అక్టోబర్ 23 న మిత్రాదేవ్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మిత్రాదేవ్‌ శర్మ.. ఫోన్ కాల్, వాట్సాప్ చాట్ వైరల్‌ కావడంతో నీల్ నక్షత్రదేవ్‌.. నకిలీ అభ్యర్థితో పరీక్ష రాయించి టాపర్‌గా నిలిచాడన్న సమాచారం బయటపడింది. నిందితుడు నీల్ నక్షత్రదాస్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.