బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 19:46:25

జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు వాయిదా

జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు వాయిదా

ఢిల్లీ : జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(జేఈఈ) మెయిన్స్‌, అదేవిధంగా నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్‌ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కోవిడ్‌-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలిపారు. నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబర్‌ 27వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థుల భద్రత, విద్య రెండూ ముఖ్యమేనని హెచ్‌ఆర్డీ మంత్రిత్వశాఖ పేర్కొంది. 


logo