గురువారం 04 జూన్ 2020
National - Apr 02, 2020 , 07:20:43

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వాయిదా

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)-అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వినీత్‌జోషి తెలిపారు. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2020 పరీక్షను షెడ్యూల్‌ ప్రకారం మే 17న నిర్వహించాల్సి ఉన్నది. ఏప్రిల్‌లో నిర్వహించాల్సి ఉన్న జేఈఈ (మెయిన్‌) పరీక్ష కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. జేఈఈ(మెయిన్‌) పరీక్ష తేదీని నిర్ణయించిన తర్వాత అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీల్ని  ప్రకటిస్తామని చెప్పారు. ఈ నెల 15 తర్వాత అడ్మిట్‌ కార్డులను జారీచేసే అవకాశాలను పరిశీస్తున్నామని తెలిపారు. 


logo