మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 19:06:34

హిల్సాలో 12 ఓట్ల స్వ‌ల్ప తేడాతో నెగ్గిన జేడీయూ అభ్య‌ర్థి

హిల్సాలో 12 ఓట్ల స్వ‌ల్ప తేడాతో నెగ్గిన జేడీయూ అభ్య‌ర్థి

ప‌ట్నా: ‌బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో చాలా త‌క్కువ మెజారిటీ న‌మోదైంది. హిల్సాలో జేడీయూ అభ్య‌ర్థి కృష్ణ‌మురారీ శ‌ర‌ణ్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఆర్జేడీ అభ్య‌ర్థి శ‌క్తిసింగ్ యాద‌వ్‌పై కేవ‌లం 12 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. జేడీయూ అభ్య‌ర్థికి 61,848 ఓట్లు పోల‌వ‌గా, ఆర్జేడీ అభ్య‌ర్థికి 61,836 ఓట్లు పోల‌య్యాయి. జేడీయూ అభ్య‌ర్థి కృష్ణ‌మురారి శ‌ర‌ణ్‌, జేడీయూ అభ్య‌ర్థి శ‌క్తిసింగ్ యాద‌వ్‌పై 12 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. 

అయితే, మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల‌కు హిల్సా నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన ఈసీ ఆర్జేడీ అభ్య‌ర్థి శ‌క్తిసింగ్ యాద‌వ్ 547 ఓట్ల‌తో విజ‌యం సాధించిన‌ట్లు తెలిపింది. ఆర్జేడీ అభ్య‌ర్థి గెలుపు ప‌త్రం కోసం ఎదురుచూస్తుండ‌గానే కాదుకాదు జేడీయూ అభ్య‌ర్థి 13 ఓట్ల‌తో విజ‌యం సాధించార‌ని ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌టించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ర‌ద్దు చేయ‌డంతో మ‌రో ఓటు త‌గ్గి 12 ఓట్ల మెజారిటీ వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. కాగా, సీఎం నివాసం నుంచి ఫోన్ రావ‌డంతోనే ఎన్నిక‌ల అధికారికి ఫ‌లితాన్ని మార్చి చెప్పార‌ని ఆర్జేడీ ఆరోపిస్తున్న‌ది.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.