మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 12:17:28

రాత్రి 7.45 నుంచి తెల్ల‌వారుజామున‌ 3 వ‌ర‌కు చితక్కొట్టారు..

రాత్రి 7.45 నుంచి తెల్ల‌వారుజామున‌ 3 వ‌ర‌కు చితక్కొట్టారు..

హైద‌రాబాద్‌:  త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో జ‌రిగిన తండ్రీకొడుకుల లాక‌ప్‌డెత్‌పై  సీబీఐ త‌న నివేదిక‌ను ఇవాళ వెల్ల‌డించింది. తండ్రి జ‌య‌రాజ్‌, కుమారుడు బెన్నిక్స్‌ను పోలీసులు దాదాపు ఏడు గంట‌ల పాటు చిత్ర‌హింస పెట్టిన‌ట్లు సీబీఐ త‌న రిపోర్ట్‌లో చెప్పింది.  జూన్ 19వ తేదీన అరెస్టు అయిన తండ్రీకొడుకులు.. ఆ త‌ర్వాత 22, 23 తేదీల్లో వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మ‌ర‌ణించారు. లాక్‌డౌన్ వేళ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి మొబైల్ షాపు తెరిచార‌ని ఆ ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. అయితే దారుణంగా కొట్ట‌డం వ‌ల్లే ఆ ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  స‌తానుకులం పోలీసు స్టేష‌న్‌లో ఇద్ద‌ర్నీ దారుణంగా కొట్టార‌ని, రాత్రి 7.45 నిమిషాల నుంచి తెల్ల‌వారుజామున 3 వ‌ర‌కు ఆ ఇద్ద‌ర్నీ చిత‌కొట్టార‌ని, ఆ పోలీసు స్టేష‌న్‌లోని గోడ‌ల‌పై సేక‌రించిన ర‌క్త‌పు మ‌ర‌క‌ల ఆధారంగా ఈ విష‌యాన్ని తేల్చారు. రౌండ్ల‌వారీగా పోలీసులు ఆ ఇద్ద‌ర్నీ కొట్టిన‌ట్లు సీబీఐ త‌న నివేదిక‌లో చెప్పింది. ఇన్‌స్పెక్ట‌ర్ ఎస్ శ్రీధ‌ర్ ప్రేరేపించ‌డంతో తండ్రీకొడుకుల‌పై పోలీసులు లాఠీలు విరిగేలా చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది.