శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 16:05:19

అవినీతి కేసులో జ‌యా జైట్లీకి నాలుగేళ్ల జైలుశిక్ష‌

అవినీతి కేసులో జ‌యా జైట్లీకి నాలుగేళ్ల జైలుశిక్ష‌

హైద‌రాబాద్‌: ఇర‌వై ఏళ్ల క్రితం నాటి కేసులో స‌మ‌తా పార్టీ మాజీ చీఫ్ జ‌యా జైట్లీకి నాలుగేళ్ల శిక్ష ఖ‌రారైంది. ఢిల్లీ కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది.  ర‌క్ష‌ణ రంగ ఒప్పందంలో అవినీతికి పాల్ప‌డిన‌ట్లు జ‌యపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాజ్‌పేయి ప్ర‌భుత్వంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తెహ‌ల్కా మ్యాగ్జిన్‌ త‌న స్టింగ్ ఆప‌రేష‌న్‌లో జ‌యా జైట్లీని ప‌ట్టించింది. ఆప‌రేష‌న్ వెస్ట్ ఎండ్ పేరుతో తెహ‌ల్కా ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఇదే కేసులో మ‌రో ఇద్ద‌రు పార్టీ నేత‌లు గోపాల్ ప‌చేర్‌వాలా, మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌పీ ముర్గాయిలకు కూడా శిక్ష ఖ‌రారైంది.  ప్ర‌త్యేక సీబీఐ జ‌డ్జి విరేంద్ర భ‌ట్ ఈ కేసులో శిక్ష‌ను విధించారు. ఐపీసీలోని 120-బీ సెక్ష‌న్ కింద ముగ్గురూ దోషుల‌గా తేలారు.  ఆర్మీకి ప‌రిక‌రాల స‌రఫ‌రా కోసం ఓ కంపెనీ నుంచి ఈ ముగ్గురూ ముడుపులు తీసుకున్న‌ట్లు తెహ‌ల్కా తేల్చింది.   


logo