గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 21:13:23

బైకర్ల పై జయ బచ్చన్ ఫిర్యాదు

బైకర్ల పై జయ బచ్చన్ ఫిర్యాదు

ఢిల్లీ : సామాన్య ప్రజలు మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా బైకర్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు. గురువారం రాత్రి  ప్రముఖ నటి   అమితాబచ్చన్ సతీమణి జయ బచ్చన్ తమ బంగ్లా వెలుపల రహదారిపై సైలెన్సర్ లేకుండా బైక్‌లు నడుపుతూ శబ్దం చేసిన కొంతమంది బైకర్లపై పోలీసుల కు ఫిర్యాదు చేశారు.  కొంతమంది బైకర్లు అక్కడ రేసింగ్ చేస్తున్నారని, వారి బంగ్లా వెలుపల పోలీసులు ఒక బృందాన్ని పంపే సమయానికి బైకర్లు వెళ్లిపోయారని పోలీసు అధికారి తెలిపారు. దీనిపై పోలీసులు బైకర్లపై నిఘా ఉంచాలని జయాబచ్చన్ కోరారు.logo