మంగళవారం 07 జూలై 2020
National - Jun 20, 2020 , 12:02:51

రాహుల్ గాంధీ రాజ‌కీయాలొద్దు: ‌సైనికుడి తండ్రి వీడియో

రాహుల్ గాంధీ రాజ‌కీయాలొద్దు: ‌సైనికుడి తండ్రి వీడియో

న్యూఢిల్లీ: భారత సైన్యం బ‌లంగా ఉన్న‌ద‌ని, చైనాను ఓడించే స‌త్తా మ‌న సైన్యానికి ఉన్న‌ద‌ని ఇటీవ‌ల గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ జవాన్ సురేంద్ర‌సింగ్ తండ్రి బ‌ల్వంత్ సింగ్ అన్నారు. త‌న కొడుకు సైన్యంలో ఒక‌డిగా చైనా బ‌ల‌గాల‌తో పోరాటం చేశాడ‌ని, ఇక‌ముందు కూడా త‌న పోరాటం కొన‌సాగిస్తాడ‌ని ఆయ‌న చెప్పారు. అయితే గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌లపై రాహుల్‌గాంధీ రాజ‌కీయాలు చేయొద్ద‌ని బ‌ల్వంత్‌సింగ్ హిత‌వు ప‌లికారు. 

భార‌త సైనికులను నిరాయుధులుగా పంపడం వ‌ల్లే చైనా బ‌ల‌గాల చేతిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నేత‌, రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రాజ‌స్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా‌కు చెందిన జ‌వాన్ సురేంద్ర‌సింగ్ తండ్రే ఈ విష‌యం చెప్పాడ‌ని  కేంద్రంపై మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో బ‌ల్వంత్ సింగ్ వీడియోను కేంద్ర హోమంత్రి అమిత్‌షా స‌హా, ప‌లువురు బీజేపీ నేత‌లు షేర్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతారు అని ప్ర‌శ్నిస్తున్నారు.

     ‌logo