ఆదివారం 29 మార్చి 2020
National - Mar 12, 2020 , 21:58:23

తుపాకీతో కాల్చుకొని జవాన్‌ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకొని జవాన్‌ ఆత్మహత్య

చర్ల  ‌: ఛత్తీస్‌గఢ్‌లో ఓ జవాన్‌ తుపాకీతో కాల్చుకొని  ఆత్మహత్య చేసుకొన్నాడు. దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దంతెవాడ జిల్లా పొటాలి వద్ద నెలకొల్పిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ క్యాంపులో రాజస్థాన్‌కు చెందిన ఎస్టీఎఫ్‌ జవాన్‌ రామరామ్‌స్వామి గురువారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనకి దారితీసిన పరిస్థితి వెల్లడి కాలేదని, ఘటన కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లో సర్వీస్‌ తుపాకులే జవాన్ల ప్రాణాలు తీస్తున్నట్లు అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. వారం రోజుల కిందట నారాయణపూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌ క్యాంపులో సీఏఎఫ్‌ భద్రతా దళాలకు చెందిన అనిల్‌యాదవ్‌ అనే జవాన్‌ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. గతేడాది డిసెంబర్‌ 4న ఇదే నారాయణపూర్‌ జిల్లాలో కడెనార్‌ క్యాంపులో రెహమాన్‌ ఖాన్‌ అనే ఐటీబీటీ జవాను సహచరులైన ఐదుగురు జవాన్లను తుపాకీతో కాల్చిచంపి, అనంతరం తనని తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా జవాను క్యాంపుల్లో ఆందోళన నెలకొంది. 


logo