మంగళవారం 26 జనవరి 2021
National - Dec 26, 2020 , 10:57:45

చట్టాలపై చర్చకు రావాలని కేంద్రమంత్రి సవాల్‌

చట్టాలపై చర్చకు రావాలని కేంద్రమంత్రి సవాల్‌

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను విమర్శించిన ప్రతిపక్ష నాయకులను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ విమర్శించారు. చట్టాలపై చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, డీఎంకే నేతలకు సవాల్‌ విసిరారు. ‘రాహుల్‌ గాంధీ.. హఠాత్తుగా మీరు మేం (కేంద్ర ప్రభుత్వం) తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని అంటున్నారని. చట్టాలు మంచివా? కావా? రైతుల ప్రయోజనాల కోసమో కాదా? చర్చకు రావాలని ఆయనకు బహిరంగ సవాల్‌ విసురుతున్నాను’ అన్నారు. రాహుల్‌ గాంధీ రైతుల నిరసనలను ‘సత్యాగ్రహం’తో పోల్చారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన తెలుపుతున్న రైతులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. రైతులను మోసగించేందుకే కొత్త చట్టాలను తెచ్చారంటూ ఓ పత్రిక కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన శనివారం 31వ రోజుకు చేరింది. 


logo