మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 11:52:15

కిలో వెయ్యి నుంచి రూ.70-80కి పడిపోయిన దుస్థితి

కిలో వెయ్యి నుంచి రూ.70-80కి పడిపోయిన దుస్థితి

తమిళనాడు : సమ్మర్‌లో లభించే పూలల్లో మల్లె పువ్వులదే అగ్రస్థానం. తమిళనాడుకు చెందిన మధురై రైతులు మల్లెపూల సాగును ఎక్కువగా చేపడుతుంటారు. ప్రతీ ఏడాది కిలో మల్లెపూలు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు డిమాండ్‌ను బట్టీ రైతులు అమ్మకం చేస్తుంటారు. కాగా ఈ ఏడాది కరోనా వైరస్‌ వీరిని తీవ్రంగా దెబ్బకొట్టింది. పంట చేతికొచ్చి మార్కెట్‌కు తరలించేలోపే ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో స్థానికంగా సరఫరా చేసేందుకు గానీ ఎగుమతులు చేసేందుకు గానీ వీలు లేకుండా పోయింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులు తాజా లాక్‌డౌన్‌ సడలింపులతో మిగిలిఉన్న కొద్ది పంటను అమ్మేందుకు పూనుకున్నారు. మల్లెపూల అమ్మకందారులు ముధురైలోని అరపాలయం బస్‌ స్టేషన్‌ వద్ద గల ముత్తువాని పూల మార్కెట్‌కు మల్లెపూలను తీసుకువచ్చారు. కాగా పూలు అమ్ముడు పోక దిక్కుతోచని స్థితిలో రైతులు ఊసూరుమంటున్నారు. అమ్ముడు పోయిన పూలు సైతం కిలోకి రూ. 70 నుంచి రూ. 80 మధ్య ఇచ్చి కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనిపై ఓ పూల రైతు స్పందిస్తూ... కిలో రూ.1000 అమ్మే పూలను ప్రస్తుతం కిలో రూ. 70-80 మధ్య అమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్ముడుపోని పూలను పారబోస్తున్నట్లు తెలిపాడు. logo