సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:37:37

రేపు, ఎల్లుండి నాగ్‌పూర్‌లో జ‌న‌తా క‌ర్ఫ్యూ

రేపు, ఎల్లుండి నాగ్‌పూర్‌లో జ‌న‌తా క‌ర్ఫ్యూ

ముంబై: ‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా కొన‌సాగుత‌న్న‌ది. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. న‌గ‌రాల్లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉన్న‌ది. దీంతో ప‌లు న‌గ‌రాల మున్సిప‌ల్ అధికారులు క‌రోనా విస్త‌ర‌ణ‌ను అడ్డుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. 

తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో సిటీలో క‌ర్ఫ్యూ విధించాల‌ని స్థానిక అధికార యంత్రాంగం నిర్ణ‌యించింది. జూలై 25, 26 తేదీల్లో నాగ్‌పూర్‌లో పూర్తిస్థాయిలో జ‌న‌తా క‌ర్ఫ్యూ విధించ‌నున్న‌ట్లు ఆ న‌గ‌ర మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ తుకారామ్ ముండే తెలిపారు. అయితే అత్య‌వ‌స‌ర, నిత్యవ‌స‌ర సేలు మాత్రం క‌ర్ఫ్యూ స‌మ‌యంలోనూ య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని ముండే చెప్పారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo