శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 21:12:30

భక్తులకు ప్రవేశం లేదు : ఇస్కాన్‌

భక్తులకు ప్రవేశం లేదు : ఇస్కాన్‌

నోయిడా : కరోనా మహమ్మారి కారణంగా నోయిడా సెక్టార్‌ ౩౩లోని ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ చైతన్య (ఇస్కాన్‌) ఆలయంలో బుధవారం జన్మాష్టమి సందర్భంగా భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని ఆలయ అధికారి బ్రబ్జన్‌ రంజన్‌దాస్‌ మంగళవారం చెప్పారు. విర్దావన్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌లో ఆలయ పూజారితో సహాయ 22 మందికి కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఆలయంలో పని చేసే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేయగా పూజారితోపాటు 22 మంది వైరస్‌ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా నోయిడా సెక్టార్‌ 33లోని ఆలయంలో భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని రంజన్‌దాస్‌ పేర్కొన్నారు. మా సోషల్‌ మీడియాలో ఉదయం 4గంటలకు హారతి గురుపూజ, దర్శనం, కీర్తనలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాన్సీ డ్రెస్‌, క్విజ్‌ తదితర పోటీలు సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 47,878 కరోనా క్రియాశీల కేసులు ఉండగా, 2120 మంది మరణించారు. ఇప్పటి వరకు 76,724 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.logo