సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 18:28:56

జండూ 'ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌' ఆవిష్కరణ

జండూ 'ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌' ఆవిష్కరణ

కోల్‌కతా: శతాబ్దాల చరిత్ర కలిగిన ఆయుర్వేదిక్‌ బ్రాండ్‌, భారతీయ ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి ఇమామీ లిమిటెడ్‌ సొంతం చేసుకున్న జండూ ఇప్పుడు ‘ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌’ను ఆవిష్కరించింది. కోవిడ్‌–19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారతదేశానికి మద్దతునందిస్తూ, జండూ ఇప్పుడు రోగ నిరోధక శక్తి అవసరాలను తీర్చడం లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఈ కష్టకాలంలో ప్రతి భారతీయుడూ పరిశుభ్రతను అనుసరించేందుకు తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి, పరిశుభ్రతను అందుబాటు ధరలలో అందించేందుకు జండూ ఈ వినూత్నమైన ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌ను తీసుకువచ్చింది.

గతంలో ఎన్నడూ జరగని  రీతిలో ప్రత్యేక ధరతో జండూ చ్యవన్‌ప్రాష్‌ను అందించడంతో పాటు ఉచితంగా జండూ ఆయుర్వేదిక్‌ శానిటైజర్‌తో కలిపి అందిస్తుంది. ‘‘మనమిప్పుడు అత్యంత కష్టకాలంలో ఉన్నాం. మనదేశంతో పాటుగా ప్రపంచమంతా కూడా  కోవిడ్‌–19 మహమ్మారితో పోరాడుతుంది. ఈ సమయంలో, మనందరికీ రెండు విషయాలు అత్యంత కీలకంగా మారాయి. అవి రోగ నిరోధక శక్తి , పరిశుభ్రత. రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి  చ్యవన్‌ప్రాష్‌ తోడ్పడుతుందని భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచించింది. అందుకే మేము 100 సంవత్సరాల జండూ  ఆయుర్వేద విజ్ఞానంపై ఆధారపడి వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు తోడ్పడాలనుకున్నాం" అని ఇమామీ లిమిటెడ్‌ డైరెక్టర్ హర్ష వర్థన్‌ అగర్వాల్ అన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.