బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 17:54:51

విజయవంతంగా ‘జనతా కర్ఫ్యూ’.. సంఘీభావం తెలిపిన ప్రముఖులు

విజయవంతంగా ‘జనతా కర్ఫ్యూ’.. సంఘీభావం తెలిపిన ప్రముఖులు

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్‌ భారతావని తమకు తాము గృహనిర్బంధం చేసుకొని, ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేశారు. ప్రధాని చెప్పినట్లు సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో నిలబడి.. దేశానికి విశేష సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టారు. 

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. కుటుంబ సమేతంగా తన ఇంటి ఆవరణలో నిలబడి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ సంఘీభావం తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సభ్యులతో కలిసి గంట కొడుతూ.. జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. ముంబయిలో ప్రజలు భారీ ఎత్తున ఇంటి వరండాల్లో నిలబడి చప్పట్లు కొడుతూ.. వైద్య సిబ్బందిని అభినందించారు.  

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా ప్రగతి భవన్‌లో సాయంత్ర 5 గంటలకు చప్పట్లు కొట్టి, జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గంట మోగించి, జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు.

ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌, తన కుమార్తె.. ఎంపీ సుప్రియా సూలే, కుటుంబ సభ్యులతో కలిసి దేశానికి సేవ చేస్తున్న వైద్య, పారిశుద్ద్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవడేకర్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు జనతా కర్ఫ్యూకు చప్పట్లతో మద్దతు  తెలిపారు.logo
>>>>>>