సోమవారం 30 మార్చి 2020
National - Mar 06, 2020 , 16:25:18

పోలీసులకు 14 ఏళ్ల తర్వాత చిక్కాడు..

పోలీసులకు 14 ఏళ్ల తర్వాత చిక్కాడు..

జమ్మూ: అల్లర్ల ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న దుండగుడు 14 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌ పోలీసులకు దొరికాడు. జమ్మూలోని కోట్లి-చర్కాన్‌ ప్రాంతానికి చెందిన జకీర్‌ హుస్సేన్‌ 2006లో అల్లర్లు సృష్టించి పలువురిని గాయపర్చాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే జకీర్‌హుస్సేన్‌ అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జకీర్‌ హుస్సేన్‌తోపాటు 2018లో చోరీకి పాల్పడిన కదమ్‌ హుస్సేన్‌ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. logo