మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 18:23:05

రాజకీయాల నుంచి త‌ప్పుకున్న మాజీ ఐఏఎస్

రాజకీయాల నుంచి త‌ప్పుకున్న మాజీ ఐఏఎస్

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్ రాజ‌కీయాల నుంచి మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ త‌ప్పుకున్నారు. జ‌మ్మూక‌శ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు షా ఫేస‌ల్(37) రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు స్టేట్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్స్‌కు ఫేస‌ల్ తెలియ‌జేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లో కొన‌సాగ‌లేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల నుంచి విముక్తి పొందాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు. త‌న ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించాల‌ని ఫేస‌ల్ స‌భ్యుల‌ను కోరారు. 

2010 సివిల్ స‌ర్వీసెస్ ఫ‌లితాల్లో షా ఫేస‌ల్ అత్యుత్త‌మ ర్యాంకు సాధించారు. 2019, జ‌న‌వ‌రిలో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక జ‌మ్మూక‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పించే 370 ఆర్టిక‌ల్‌ను ర‌ద్దు చేసిన స‌మ‌యంలో మిగ‌తా నాయ‌కుల‌తో పాటు ఫేస‌ల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గ‌త నెల‌లో ఫేస‌ల్‌ను విడుద‌ల చేశారు. 

జ‌మ్మూక‌శ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉపాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న ఫీరోజ్ పీర్జాదాను తాత్కాలిక చీఫ్‌గా కొన‌సాగిస్తున్న‌ట్లు పార్టీ తెలిపింది. 


logo