శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:20:21

భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు స్వాధీనం

భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు స్వాధీనం

కుప్వారా : జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని కుప్వారా జిల్లా సద్నాటాప్ ఆర్మీ, పోలీసుల సంయుక్త చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న ఆయుధాలు, మాదకద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. సద్నాటాప్‌ చెక్‌పోస్టు వద్ద 7 రాష్ట్రీయ రైఫిల్స్, కుప్వారా పోలీసుల బృందాలు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు.  హాజీనగర్ నివాసి ఉమర్ షేక్ నడుపుతున్నఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకొని ఉమర్‌ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో  రెండు మ్యాగజైన్లతోపాటు ఏకే -56 రైఫిల్‌, రెండు పిస్టల్స్‌, నాలుగు మ్యాగజైన్లు, 76 రౌండ్ల మందుగుండు సామగ్రి, 90 రౌండ్ల పిస్టల్ మందుగుండు సామగ్రి, చైనీస్ గుర్తులున్న ఆరు గ్రెనేడ్లు, ఆరు బ్లూ-ప్లాస్టిక్ గ్రెనేడ్లు, ఎనిమిది ఓజీ ప్లాస్టిక్ గ్రెనేడ్లతోపాటు 10 కిలోల మాదకద్రవ్యాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు.


logo