గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 02:58:38

జామియా మళ్లీ హింసాత్మకం

జామియా మళ్లీ హింసాత్మకం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని హస్తినలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన హింసాత్మకమైంది. వర్సిటీ నుంచి పార్లమెంట్‌కు బయలు దేరిన జామియా వర్సిటీ విద్యార్థులు, స్థానికులను యూనివర్సిటీ ఏడో గేట్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

  • పార్లమెంట్‌ వైపు ప్రదర్శనకు విద్యార్థుల యత్నం
  • మహిళలు, విద్యార్థినులపై ఖాకీల దాష్టీకం.. 16 మందికి గాయాలు
  • మధ్య ఢిల్లీ నుంచి జంతర్‌మంతర్‌ వరకు మరో ప్రదర్శన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని హస్తినలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన హింసాత్మకమైంది. వర్సిటీ నుంచి పార్లమెంట్‌కు బయలు దేరిన జామియా వర్సిటీ విద్యార్థులు, స్థానికులను యూనివర్సిటీ ఏడో గేట్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. మర్గాంగాలను లక్ష్యంగా  మహిళలను, విద్యార్థినులను నడుముకు దిగువన కొట్టి గాయపరిచారు. ఆందోళనకారులను తోసివేస్తూ మూలకు నెట్టివేశారు. తొక్కిసలాట పరిస్థితులతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఈ ఘర్షణలో గాయపడిన 16 మంది అల్‌షిఫా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 


ఛాతిలో, పొత్తి కడుపులో నొప్పి రావడంతోపాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఒకరిని ఐసీయూలో చేర్చారు.   కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, సమయం గడిచిన కొద్దీ ఆందోళనకారుల సంఖ్య పెరిగింది. బ్యారికేడ్లను దాటుకుంటూ ముందుకెళ్లిన విద్యార్థులను భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నా రు. హల్లాబోల్‌ నినాదాల మధ్య త్రివర్ణ పతకాలు ప్రదర్శిస్తూ పురుషులు మానవ హారం నిర్మిస్తే, మహిళలు ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు అనుమతి పత్రాలు చూపబోమన్నారు. ‘బ్రిటిష్‌ పాలకులకే భయపడలేదు. 


ఇతరులకు ఎందుకు భయపడాలి?’ అని స్పష్టం చేశారు. చివరకు విద్యార్థులు వర్సి టీ బయట ధర్నాకు దిగారు. భద్రతా కారణాల పేరుతో సుఖ్‌దేవ్‌ విహార్‌ స్టేషన్‌ను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ తెలిపింది. సుఖ్‌దేవ్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ‘మధ్య ఢిల్లీ’ లో వందల మంది ఆందోళనకారులు కదం తొక్కారు. పదేండ్ల బాలలు, వృద్ధులు, యూనివర్సిటీ విద్యార్థులు, పౌర సమాజ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. మండీ హౌస్‌ నుంచి బారాఖంబా రోడ్డు, టాల్‌స్టాయ్‌ రోడ్‌ మీదుగా జంతర్‌మంతర్‌ వరకు సాగారు. 


ఈ నేపథ్యంలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను భారీగా మోహరించారు. ఒక పోలీస్‌ అధికారి మాట్లాడుతూ ఆందోళనకారులు అనుమతి తీసుకోకున్నా, వారి ప్రదర్శన శాంతియుతంగా సాగినందున తమకు ఏ సమస్యా లేదన్నారు. వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూపీఏ) ఆధ్వర్యంలో నిరసన జరిగింది. స్వాతం త్య్ర సమరయోధులు భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలె ఫొటోలు పట్టుకుని మరీ ఆందోళనలో పాల్గొన్నారు. నల్లచట్టాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత సెప్టెంబర్‌లో అవినీతి, నిర్లక్ష్యం కేసుల నుంచి నిర్దోషిగా బయటపడిన గోరఖ్‌పూర్‌ బీఆర్డీ దవాఖాన డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ భా ర్య, దేశద్రోహ నేరం కింద అరెస్టయిన షార్జీల్‌ ఇమామ్‌ సోదరుడు, తదితరులు పాల్గొన్నారు. షాహీన్‌బాగ్‌లో మాదిరిగా నిరసన తెలుపుతున్న సుందర్‌ నగ్రీ ప్రాంత వాసులు కూడా ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నారు.


logo
>>>>>>