ఆదివారం 24 మే 2020
National - Feb 16, 2020 , 09:23:53

పోలీసుల దాడి వీడియోను విడుదల చేసిన జామియా కోఆర్డినేషన్‌ కమిటీ

పోలీసుల దాడి వీడియోను విడుదల చేసిన జామియా కోఆర్డినేషన్‌ కమిటీ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మీలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఆందోళన నాడు పోలీసులు విద్యార్థులపై ఏ విధంగా దాష్టికానికి పాల్పడ్డారో తెలిపే వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. జామియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఈ వీడియోను విడుదల చేసింది. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నిన్న వెలుగులోకి వచ్చి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వర్సిటీ పాత రీడింగ్‌ హాల్‌(ఎంఫిల్‌ సెక్షన్‌) లో విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. ఒక్కసారిగా పోలీసులు హాల్‌లో ప్రవేశించి కనపడ్డ విద్యార్థినల్లా విచక్షణారహితంగా కొట్టారు. కొందరు భయపడి దాక్కున్నారు. కొందరు పారిపోయేందుకు ప్రయత్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 15వ తేదీ నాడు చేపట్టిన ఆందోళన కార్యక్రమం చివరికి విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణకు దారితీసింది. పలు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. వర్సిటీలోకి ప్రవేశించి 100 మంది విద్యార్థులను నిర్భందించారు. logo