గురువారం 04 జూన్ 2020
National - May 21, 2020 , 12:32:45

ఢిల్లీ అల్లర్ల కేసు.. జామియా మిలియా విద్యార్థి అరెస్ట్‌

ఢిల్లీ అల్లర్ల కేసు.. జామియా మిలియా విద్యార్థి అరెస్ట్‌

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో ప్రమేయమున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థి ఆసిఫ్‌ తన్హాను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇందులో సుమారు 53 మంది మరణించగా, భారీసంఖ్యలో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ హింసాత్మక ఘటనలతో జామియా మిలియాలో చదువుతున్న ఆసిఫ్‌ తన్హాకు సంబంధం ఉన్నదని, అతనిపై కేసు నమోదు చేశామని ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌లు ప్రకటించారు. ఇదే కేసులో చాంద్‌భాగ్‌ ప్రాంతానికి చెందిన షాదాబ్‌ అనే వ్యక్తిని అరెస్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జామియా మిలియాలో జరిగిన అల్లర్ల కేసులో కూడా ఆసిఫ్‌ తన్హాను క్రైంబ్రాంచ్‌ పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్నారు.


logo