శుక్రవారం 15 జనవరి 2021
National - Oct 14, 2020 , 18:41:02

మాస్కు పెట్టుకొమ్మంటే పోలీసుల‌నే కొట్టారు!

మాస్కు పెట్టుకొమ్మంటే పోలీసుల‌నే కొట్టారు!

బెంగ‌ళూరు: క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో మాస్కు పెట్టుకొమ్మ‌ని సూచించిన పోలీసులపై ముగ్గురు వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. క‌ర్ణాట‌క రాష్ట్రం, బెంగ‌ళూరు న‌గ‌రంలోని జ‌ల‌హల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో బుధ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మాస్కులు లేకుండా బైకులపై రోడ్డు మీద‌కు వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తుల‌ను జ‌ల‌హ‌ల్లి పోలీసులు ఆపారు. క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్నందున ముఖాలకు మాస్కులు లేకుండా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు. ప్ర‌స్తుతం మాస్కులు లేకుండా వ‌చ్చినందుకు ఫైన్ చెల్లించాలని కోరారు. 

అయితే, జ‌రిమానా చెల్లించేందుకు నిరాక‌రించిన ఆ ముగ్గురు వ్య‌క్తులు పోలీసుల‌పైనే దాడికి పాల్ప‌డ్డారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజ‌రుప‌ర్చారు. కోర్టు ఆ ముగ్గురు వ్య‌క్తుల‌కు 14 రోజుల‌ జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. కాగా, ఈ ఘ‌ట‌న‌పై బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌నర్ మాట్లాడుతూ.. మా సిబ్బందిపై జ‌రిగే ఏ విధ‌మైన‌ హింస‌ను, దాడిని కూడా తాము లైట్‌గా తీసుకోబోమ‌ని హెచ్చ‌రించారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.