మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Aug 21, 2020 , 01:01:24

కేంద్రమంత్రి షెకావత్‌కు కరోనా

కేంద్రమంత్రి షెకావత్‌కు కరోనా

న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్‌లో గురువారం వెల్లడించారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌ అని తేలింది. గత కొద్ది రోజుల నుంచి నన్ను కలిసిన వాళ్లు తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలి’ అని మంత్రి ట్వీట్‌ చేశారు.