మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Aug 20, 2020 , 14:22:41

మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌

మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి బారిన మ‌రో కేంద్ర మంత్రి ప‌డ్డారు. తాజాగా కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో వైద్యుల సూచ‌న మేర‌కు కేంద్ర మంత్రి ఆస్ప‌త్రిలో చేరారు. ఈ సంద‌ర్భంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ట్వీట్ చేస్తూ.. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. ముందస్తు జాగ్ర‌త్త‌గా డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరాను. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని, ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.